Wednesday, January 22, 2025

ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రియుడు ఉరేసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియురాలు పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ద్వారకానగర్‌కు చెందిన గంగాధర్, ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ప్రేమ జంట ప్రేమ వ్యవహారం నడిపించారు. ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో గత సంవత్సరం నుంచి అతడితో ఆమె మాట్లాడటం మానేసింది. సోమవారం ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమెకు అతడు పలుమార్లు ఫోన్ చేశాడు. ప్రియురాలు స్పందించకపోవడంతో మంగళవారం ఇంటిలోని వంటగదిలో హుక్కుకు చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News