Thursday, January 23, 2025

అన్ని రాష్ట్రాల ప్రజలకు అండగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ : తెలంగాణకు వలస వచ్చిన ప్రతి కుటుంబాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వ అధినేత కెసిర్ తన కడుపులో పెట్టుకుని చూసుకున్నారని , ఎవరినీ నిర్లక్షం చేయకుండా వారి కష్టసుఖాల్లో అండగా ఉన్నారని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌లు అన్నారు. రాజీవ్ రహదారిపై ఉన్న సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని మార్వాడీల సంఘం భవనంలో ఆదివారం నిర్వహించిన మార్వాడీ ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ్దలో ఇతర రాష్ట్రాల వారి భాగస్వామ్యం కూడాఉందని విశ్వసించే కెసిఆర్ వారిని గౌరవంగా ఇంకా చెప్పాలంటే తెలంగాణ బిడ్డలుగానే చూశారన్నారు. గతంలో తెలం గాణలో జరుగుతున్న అభివృద్ధి లో భాగంగా వివిధ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కూలీలు తమచెమట ఓడ్చి నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వా ములయ్యారన్నారు. ఒక దశలో కరోనా కష్టకాలంలో పనులు ఆగిపోగా ఆ పేద కూలీలకు అన్నీ తానై సిఎం కెసిఆర్ ఆదుకున్నారని, వారిని తమ స సొంత రాష్ట్రాలకు ప్రభుత్వ ఖర్చులతో పంపించారన్నారు. అలాగే మన రాష్ట్రంలో వివిధ రకాల వ్యాపారస్తులు ఉన్నట్లే పొట్ట కూటికోసం వచ్చిన క్రమంగా స్థిరపడుతున్న మార్వాడీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారిని తెలంగాణ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి తగిన సహాయాన్ని అందించటానికి సిద్ధ్దంగా ఉన్నామన్నారు. అన్ని రాష్ట్రాల , వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుకునే సిఎం కెసిఆర్‌ను రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించటంలో మార్వాడీలు అగ్రభాగాన నిలవాలని వారు పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌కు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్‌డిసి ఛైర్మన్ ప్రతాపరెడ్డి, ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తాలకు తలపాగాలు చుట్టి , పుష్పగుచ్చాలు ,శాలువాలతో మార్వాడీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News