Monday, February 3, 2025

తండ్రి శవంలో సగ భాగం కావాలన్నా పెద్ద కుమారుడు

- Advertisement -
- Advertisement -

తండ్రి చివరి కోరిక మేరకు దహన సంస్కారాలు చేస్తున్న తమ్ముడుతో అన్న గొడవ పడిన ఘటన మధ్యప్రదేశ్ లోని తికంఘడ్ జిల్లాలో చోటు చేసుకుంది.లిథోరాతల్ గ్రామంలో చిన్న కుమారుడు తో తండ్రి కలిసి ఉంటున్నాడు.గత కొంతకాలంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందాడు. పక్క గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు తండ్రి మరణ వార్త తెలుసుకుని గ్రామానికి వచ్చి తండ్రికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్న తమ్ముడుతో గొడవ పడ్డాడు.

మద్యం మత్తులో ఉన్న పెద్ద కుమారుడు తన తండ్రికి తాను అంత్యక్రియలు నిర్వహిస్తానని తండ్రి శవం లో సగభాగం కావాలని డిమాండ్ చేశాడు. గ్రామస్తులు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థానిక చేరుకున్న పోలీసులు పెద్ద కుమారుడు కి నచ్చజెప్పి తండ్రి అంత్యక్రియలు  జరిగేలా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News