Monday, January 20, 2025

అన్నను హత్య చేసిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సొంత అన్నను కత్తితో గొంతుకోసి హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పి.మధు కథనం ప్రకారం…. శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన రహీం అలియాస్ రెహమాన్ (40), ఇస్మాయిల్ అన్నదమ్ములు. రహీంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో తరచూ రోడ్లపై తిరుగుతూ అందరితో గోడవలు పడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇస్మాయిల్‌పై సైతం దాడి చేశాడు.

గురువారం ఉదయం కూడా రహీం, ఇస్మాయిల్‌ను తీవ్రంగా కొట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇస్మాయిల్ తన అన్న రెహమాన్‌ను కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఇస్మాయిల్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News