Thursday, January 23, 2025

వికారాబాద్ జిల్లాలో దారుణం..

- Advertisement -
- Advertisement -

యాలాల్ : ఆస్తి కోసం తమ్ముడిని గొడ్డలతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం నాగసమందర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగసముందర్ గ్రామానికి చెందిన గుబ్బ వెంకటేష్ తన తమ్ముడు గుబ్బ రవి (35)ని సోమవారం మధ్యాహ్నం ఇంట్లో గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. నాగసమందర్ గ్రామానికి చెందిన గుబ్బ కృష్ణ, గుబ్బ వెంకటేష్, గుబ్బ రవిలు ముగ్గురు అన్నదమ్ములు. చిన్న కుమారుడు గుబ్బ రవి దగ్గర తల్లిదండ్రులు ఉంటున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా గుబ్బ రవి తల్లిదండ్రులను దగ్గరే ఉంచుకొని 10 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

గుబ్బ వెంకటేష్ గుబ్బ కృష్ణలు తాండూరులోని గృహకల్పలో ఉంటూ ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం సొంత గ్రామం నాగసమందర్‌కు వచ్చిన అన్నలు పొలం మాకు ఇవ్వాలని, అమ్మానాన్నలను మేము చూసుకుంటామని చెప్పగా పొలం ఇచ్చే ప్రసక్తే లేదని, అమ్మానాన్నలు నా దగ్గరే ఉంటారని తమ్ముడు చెప్పడంతో కోపం పెంచుకున్న అన్న వెంకటేష్ సోమవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి గొడ్డలతో తలను నరికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం యాలాల్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News