Thursday, January 23, 2025

వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన యువకుడు

- Advertisement -
- Advertisement -

బాసర : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రామ్మర్తి లక్ష్మీ (70) అనే వృద్దురాలు బాసర వైపు పుష్కర ఘాట్ వైపు మెట్ల వెంబడి వెళ్లి మట్టి ఉబిలో నుండి నదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతుండగా అదే సమయానికి అటువైపు నుండి యంచ గ్రామానికి వస్తున్న మల్యాన్ యోగేష్ అనే యువకుడు బయటకు తీసుకరావడానికి ప్రయత్నిస్తుండగా ఆమె ప్రతి ఘటించడంతో యంచ సర్పంచ్ కు

ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో యంచ గ్రామ యువకులు స్థానిక ఎస్‌ఐ మహేష్ సమాచారం ఇవ్వడంతో త్వరితగతిన సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని కాపాడి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే రెండు నెలల క్రితం ఆమె పెద్ద కుమారుడు మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు వృద్దురాలు తెలిపింది. ఈ సందర్బంగా వృద్దురాలిని కాపాడిన యోగేష్‌ను ఎస్‌ఐ, పలువురు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News