వనపర్తి ప్రతినిధి : ఓటు వేసేందుకు వయోవృద్ధులకు అన్ని విధాల సౌకర్యాలు క ల్పించడానికి కట్టుబడి ఉన్నామని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వృయోవృద్ధుల సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా సం క్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఓటరు అవగాహ న సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వా రు కోరుకుంటే ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు.
ఓటు విలువ అందరి కంటే వయోవృద్ధులకే బాగా తెలుసు కాబట్టి ఓటింగ్ శాతం పెంచే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వనపర్తి పట్టణంలో వెల్నెస్ సెంట ర్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంతో పాటు మండలాలలో సైతం రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చే యాలని ఆదేశించారు.
వంట చేసుకోడానికి వృద్ధులకు కష్టంగా ఉంటుందని తమ దృష్టికి వచ్చిందని అందువల్ల కమ్యూనిటి కిచెన్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్న జౌత్సాహికులకు సహకరించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఆరోగ్య సమస్యలు ఎ క్కువగా వచ్చే అవకాశం ఉన్నందున వయోవృద్ధుల కొరకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి రవిశంకర్‌ను ఆదేశించారు.
వనపర్తి పట్టణంలో వైద్య పరమైన సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. వయోవృద్ధులలో పురుషులు, మహిళలు ఉన్నప్పటికి మహిళలు వారి సమస్యలను బహిర్గత పరచలేకపోతున్నారని ఈ విషయంలో వయోవృద్ధుల సంఘం పెద్దలు ఆలోచించాలని జిల్లా కలెక్టర్ కోరారు. వయోవృద్ధులకు కావలసిన భోజన సదుపాయంతో పాటు మిత్రులతో చర్చలు చేసే అవకాశం కాలక్షేపానికి కమ్యూనిటీ స్టేషన్స్ లో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడ ం ద్వారా మానసిక ప్రశాంత చేకూరుతుందని అం దుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బి డబ్లుఓ రామ మనోహర్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రవి శంకర్ , రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఖుతుబుద్దీన్, సి సెక్ష న్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, విద్యాధికారి, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.