Sunday, January 19, 2025

కొడుకు మృతదేహం కోసం యాచకులైన తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

Parents become beggars

పాట్నా: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కొడుకు మృతదేహం కోసం తల్లిదండ్రులు యాచకులుగా మారారు. కొడుకు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి పంపించడానికి అందులో పని చేసే ఒక ఉద్యోగి 50,000 రూపాయలు అడిగాడట. ఆ డబ్బులు తీర్చడానికి మృతుడి తల్లిదండ్రులు యాచకులుగా మారారు. బిహార్‌లోని సమప్తీపూర్‌లో ఉన్న సర్దార్ ఆసుపత్రిలో వెలుగు చూసింది ఈ  ఘటన. తాము చాలా పేదవారిమని, అంత డబ్బు చెల్లించే స్తోమత తమకు లేదని, కానీ తమ కుమారుడి మృతదేహాన్నైనా తీసుకోవాలని యాచకులుగా మారినట్లు ఆ తల్లిదండ్రులు తెలిపారు. కాగా, ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ ఆసుపత్రి ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఆ తల్లిదండ్రులకు కుమారుడి మృతదేహాన్ని కూడా అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News