Monday, January 20, 2025

వృద్ద దంపతుల దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వృద్ధ్ద దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే. గ్రామానికి చెందిన దారం నారాయణ గుప్త (75), సుశీల (65) భార్యభర్తలు. గత 40 ఏండ్ల క్రితం రైతునగర్ గ్రామానికి చెందిన సుశీలను వివాహం చేసుకున్న నారాయణ గుప్త ఇక్కడే స్థిరపడ్డాడు. భార్యభర్తలిద్దరు కిరాణ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తమ వద్ద దాచుకున్న డబ్బులతో అందరితో కలివిడిగా ఉంటూ జీవనం సాగించే వారని స్థానికులు తెలిపారు.

మంగళవారం రాత్రి ఇంటి వెనుకాల నుంచి నిచ్చెన వేసుకుని చొరబడ్డ దండగులు ఇంట్లో టీవీ శబ్దం ఎక్కువ చేసి ఇతరులకు అరుపులు, కేకలు బయటకు వినబడకుండా జాగ్రత్త పడ్డారని బాన్సువాడ రూరల్ సిఐ మురళి తెలిపారు. నారాయణ గుప్తను తలపై రాడ్ బాది హత్య చేశారని, సుశీలను చీరతో ఉరి తీసి హత్య చేసినట్లు తెలుస్తుందన్నారు. ఇద్దరిని చంపి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లినట్లు బంధువులు, స్థానికులు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు డాగ్ స్వాడ్, క్లూస్ టీంలను పిలిచి విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ జగన్నాథ రెడ్డి సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News