Thursday, January 23, 2025

ఆస్తి తగాదాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చందుర్తి: ఆస్తి తగాదాలతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అసిరెడ్డిపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అసిరెడ్డిపల్లెకు చెందిన కనికరపు దేవయ్య, లక్ష్మినరసవ్వ దంపతులకు గత ఏడాది కొడుకులకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి.

దీంతో కొడుకు, కోడలు ఇంట్లోని కులదైవ విగ్రహాన్ని ఇంటి నుండి బయటకు తీసివేస్తామని అనడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇవన్నీ చూస్తూ తామింకా బతకలేమని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి పంపించినట్లు చందుర్తి ఎస్‌ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News