Sunday, December 22, 2024

మంత్రాలు చేస్తున్నాడని… వృద్ధుడిని నిప్పుల్లో డ్యాన్స్ చేయించారు

- Advertisement -
- Advertisement -

ముంబయి: 75 ఏళ్ల వృద్ధుడు మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో అతడిని అగ్ని గుండంలో డ్యాన్స్ చేయించిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముర్బాద్ తాలూకాలోని కెర్వెల్ గ్రామంలో 75 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్నాడు. గత కొన్ని రోజులు నుంచి సదరు వృద్ధుడు మంత్రాలు చేస్తున్నాడని గ్రామస్థులు అనుమానం పెంచుకున్నారు. ఆ గ్రామంలోని దేవాలయంలో అగ్నిగుండాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 15 నుంచి 20 మంది గ్రామస్థులు ఆ వృద్ధుడిని అగ్ని గుండాల వద్దకు లాక్కొచ్చారు. అనంతరం చేతులు కట్టేసి అగ్ని గుండాల్లో డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు. అగ్ని గుండాల్లోకి వృద్ధుడిని తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వృద్ధుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News