- Advertisement -
సుల్తానాబాద్ :మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. వివరా ల్లోకి వెళితే సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఏలవేణి రాజయ్య అనే వృద్ధుడు స్థానిక స్టేషన్ ఎదుట బుధవారం పురుగుల మందు తాగగా గమనించిన పోలీసులు హుటా హుటిన రాజయ్యను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా అధిక మోతాదులో రాజయ్య పురుగుల మందు సేవించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక సివిల్ ఆసుపత్రిలో మృతదేహాన్ని ఉంచారు. రాజయ్య ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు ఎలా వేణి రాజయ్యకు అతని కూతురుకు భూ సమస్యలతో గొడవలు ఉన్నాయని ఆ కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఎస్సై విజయేందర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -