Thursday, December 26, 2024

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ ః రైల్వే బ్రిడ్జీ అండర్ గ్రౌండ్ పనుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్దుడు నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. రైల్వే పనులు నడుస్తున్నప్పటికి రైల్వే ట్రాక్ దాటే ప్రాంతంలో కనీస ప్రమాద సూచిక బోర్డులు గాని , కాపల మనిషిని పెట్టి గేటు లాగే విధంగా చర్యలు తీసుకోక పోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తలమడ్ల, ఆరేపల్లి, ఆరేపల్లి తాండ గ్రామాలకు చెందిన ప్రజలు అరోపిస్తున్నారు. తలమడ్ల గ్రామంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జీ పనులు జరుగుతుండడంతో తలమడ్ల, ఆరేపల్లి , ఆరేపల్లి తాండ గ్రామాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు గ్రామాలకు వెళ్ళాలంటే పనులు జరిగే ప్రాంతం నుండి సుమారు 2 కిలోమీటర్ల వరకు వెళ్ళి రైల్వే ట్రాక్ దాటవలసి ఉంటుంది.

ఈ క్రమంలో ఇరు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఆరేపల్లి తాండకు చెందిన సిద్దానాయక్ (60) తన స్వంత పని నిమిత్తం కామారెడ్డి వెళ్ళే క్రమంలో ప్రక్కన నుండి వచ్చే రైలును గమనించక పోవడంతో రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకోని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకోని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఎరియా ఆసుపత్రికి తరలించారు.

కాంట్రాక్టర్ నిర్లక్షంతోనే ప్రమాదాలు ః
రైల్వే బ్రిడ్జీ పనులు జరుగుతున్నప్పటికి ప్రత్యమ్నయంగా ఓక ఉద్యోగిని గాని లేదా ప్రమాద సూచికలు ఎర్పాటు చేయవలసిన కాంట్రక్టర్ నిర్లక్షంగానే ప్రమాదాలు చోటు చేసుకనే అవకాశాలు ఉన్నాయని గ్రామాల ప్రజలు వాపోయారు. ప్రస్తుతం వెళ్ళే రైల్వే ట్రాక్ వద్ద సూచికలు గాని ఓక వ్యక్తిని గాని ప్రమాద సూచికలు తెలిపేలా ఉంటే ఈ ఘటన జరిగేది కాదని అయ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. నిత్యం పాఠశాలల విద్యార్థులు, గ్రామాల ప్రజలు ఈ మార్గం ద్వారనే ప్రయాణిస్తుంటారు. ఓక వ్యక్తిని గాని ప్రమాదసూచికలు తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఫలుమార్లు అధికారులకు విన్నవించిన పలితం లేదని మరో ప్రాణం బలి కాకుమందే గ్రామ పంచాయితీ, రైల్వే అధికారులు, బిడ్జీ కాంట్రాక్టర్ తగిన జాగ్రత్తలు చేపట్టాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ముందే హెచ్చరించిన మన తెలంగాణ ః
రాజంపేట్ మండలంలోని తలమడ్ల గ్రామంలో గల అండర్ బ్రిడ్జీ నిర్మాణంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గత నెల 16న మన తెలంగాణ పనులు సాగవు ….ప్రయాణం సాగదు, ప్రమాదకరంగా తలమడ్ల రోడ్డు పనులు, రాక పోకలకు అంతరాయం నిత్య ప్రమాదాలకు నిలయం అంటు కథనాన్ని ప్రచురించింది. అయిన సంబందిత అధికారుల నిర్లక్షంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని బావించవచ్చు. అధికారులు, పాలకులు మెలుకోని త్వరితగతిన పనులు పూర్తి చేసి అయ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు మరి అధికారులు, పాలకులు మెలుకుంటారో లేదో చుడాలి మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News