Sunday, December 22, 2024

చంద్రాపూర్‌లో వృద్ధుడిని చంపిన పులి

- Advertisement -
- Advertisement -

Elderly man killed by tiger in Chandrapur

చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక 65 ఏళ్ల వృద్ధుడిని పులి చంపివేసింది. సిన్హాలా గ్రామానికి చెందిన వృద్ధుడు దశరథ్ పెండోర్ శుక్రవారం మేకలను తీసుకుని మేత కోసం అడవుల్లోకి వెళ్లాడని, సాయంత్రానికి కూడా అతను ఇంటికి తిరిగిరాలేదని చంద్రాపూర్ అటవీ డివిజన్ సీనియర్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. దీంతో శనివారం ఉదయం అటవీ సిబ్బంది, గ్రామస్తులు అడవిలో గాలించగా వృద్ధుడి మృతదేహం లభించిందని ఆయన చెప్పారు. తడోబా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వాఘాడో అనే పులి గాండ్రింపులు సమీపంలో వినిపించాయని, గ్రామస్తుల రక్షణ కోసం ఆ ప్రాంతంలో పులి కదలికలపై నిఘా వేశామని ఆ అధికారి చెప్పారు. మృతుని కుటుంబానికి ప్రాథమిక పరిహారం కింద రూ. 30,000 అందచేసినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News