Monday, December 23, 2024

వయోవృద్ధురాలిపై కొడుకు, మనుమడి దాడి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: అన్నదమ్ముల్ల మధ్య నెలకొన్న ఆస్తితగాదాలతో కన్నతల్లి పై కర్కశత్వానికి దారితీసింది. సమాజంలో కన్నతల్లికి వృద్దాప్యంలో అండగా ఉండాల్సిన కన్నకొడుకులే వారి పట్ల మానవత్వ విలువలు కోల్పోయి రాక్షసత్వానికి ఒడికడుతున్నారు. కన్నకొడుకు, మనుమడు కలిసి ఓ వయోవృద్దురాలిపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ హృదయ విదారకర సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

ఈదూలూర్ గ్రామానికి చెందిన సులువ లక్ష్మమ్మ (60) పైబడిన వయోవృద్ధురాలికి 4 గురు కొడుకులు, వారందరికి సమానంగా 260 గజాల చొప్పున ఇంటి స్థలం, ఆస్తిపాస్తులను సమానంగా పంచి ఇచ్చింది. కాగా అన్నదమ్ముల్ల మధ్య ఉన్న ఆస్తి తగాదాలను దృష్టిలో పెట్టుకొని తల్లి లక్ష్మమ్మ ను పెద్ద కుమారుడు సులువ నరసయ్య, మరియు మనుమడు సులువ వినోద్ లు కాలుతో తన్ని, బూతులు తిట్టి, విచక్షణా రహితంగా కొట్టడంతో కాలు విరిగింది. ఈ విషయాన్ని గమనించిన వృద్దురాలి బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం పై గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వయోవృద్దుల టోల్ ప్రీ నెంబర్ 14567కి సమాచారం అందించడంతో వయోవృద్ధుల జిల్లా సంక్షేమ అధికారి కె.వి. కృష్ణవేణి తక్షణమే స్పందించి మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి ని ఆదేశించగా ఆయన ఈదులూర్ గ్రామాన్ని సందర్శించి ఈ ఘటన పై విచారించడం జరిగింది. వయోవృద్ధురాలి పై జరిగిన దాడి గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచన మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మానవతా విలువలు కోల్పోయి కేవలం మానవ సంబంధాలను మరచి ఆర్ధిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో వీరిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు మరియు సీనియర్ సిటిజన్ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలు వారి కూతురు సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దాడి చేసిన సులువ నరసయ్య, మనుమడు సులువ వినోద్ లపై వయోవృద్ధుల చట్టం 2007 ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News