- Advertisement -
హైదరాబాద్: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మహబూబ్‌నగర్ జిల్లా, మక్తల్‌కు చెందిన మారెమ్మ(70) ఎర్రగడ్డలోని మెట్రో స్టేషన్‌కు వచ్చింది. మెట్రో స్టేషన్‌పైకి వెళ్లి కిందకు దూకింది. దీంతో తీవ్రగాయాలు కావడంతో మారెమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే మారెమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు సనత్‌నగర్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -