Sunday, December 22, 2024

వీధికుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

- Advertisement -
- Advertisement -

మాచారెడ్డి : వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, లచ్చపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ముస్తాబాద్ రామవ్వ (60) అనే వృద్ధ్దురాలు ఇంటి ముందు కూర్చుని ఉండగా కుక్కలు ఒకేసారి ఆమెపై దాడి చేశాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలికి ఉండటానికి స్వంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంటిలో ఉంటోందని స్థానికులు తెలిపారు. ఆమె కూతురు అంగన్వాడీ ఆయాగా పనిచేస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News