- Advertisement -
శ్రీనగర్: వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్‌గా మస్రత్ ఆలమ్ ఎన్నికయ్యారు. గత వారం మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా షబీర్ అహ్మద్ షా, గులాం అహ్మద్ గుల్జార్‌లను ఎన్నుకున్నట్లు హరియత్ కాన్ఫరెన్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. హురియత్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగేంతవరకు ఈ నియామకాలు తాత్కాలికమైనవని హురియత్ తెలిపింది. హురియత్ కాన్ఫరెన్స్ జీవితకాల చైర్మన్‌గా గతంలో ఎన్నికైన గిలాని గత ఏడాది పదవి నుంచి తప్పుకున్నారు. పాకిస్తాన్ మద్దతుదారుడైన గిలాని జమ్మూ కశ్మీరులో గడచిన మూడు దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపించారు.
- Advertisement -