లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటిదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 11 జిల్లాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. షామిలీ, హాపూర్, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్‌నగర్, మీరట్, బాగ్‌పట్, ఘజియాబాద్, బులంద్‌షహార్, అలీగడ్, మధుర, ఆగ్రా జిల్లాలో ఈ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గురువారం ఉదయం 7 గంటలే ప్రారంభమైన పోలింగ్ లో ప్రజలు పాల్గొంటున్నారు. 10,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది. కాగా, 2017లో గెలిచినట్టుగానే ఈసారి కూడా పశ్చిమ యూపీని స్వీప్ చేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2017లో బీజేపీ ఇక్కడ క్లీన్‌స్వీప్ చేసింది.మొత్తం 58 సీట్లుంటే 53 సీట్లను దక్కించుకుంది.
Election 2022: Phase 1 Polls begins in Western UP