Monday, January 20, 2025

రాష్ట్రస్థాయి నేతలతోనే ఇబ్బందులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ స్పెషల్ టాస్క్ అప్పగించింది. అభ్యర్థుల లిస్టు అనంతరం బుజ్జగింపుల బాధ్యతను హైకమాండ్ ఆయనపై ఉంచింది. ఆయనకు కొత్త బాధ్యతలతో ప్రత్యేకంగా ఫోర్ మెన్ కమిటీని (సమన్వయ కమిటీని) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాణిక్ రావు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు.

టికెట్ రాని నేతలకు స్థాయిని బట్టి భరోసా కల్పించాలని ఫోర్ మెన్ కమిటీ తీర్మానించింది. ఒకవేళ ఎంపిటిసి, జడ్పీటిసి పోస్టుల్లో పనిచేసే వారు టికెట్ ఆశిస్తే కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చాక ఆయా పరిధిలో నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నమ్మకం కల్పించడం. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి లీడర్లకు స్టేట్ కేడర్ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఈ ఫోర్ మెన్ కమిటీ బుజ్జగించనుంది. కర్ణాటక మంత్రి బోసురాజు అంశాన్ని ప్రస్తావిస్తూ అసంతృప్తులను కాంప్రమైజ్ చేయనున్నారు. అయితే స్థానిక సంస్థల్లో పనిచేసిన లీడర్లు కమిటీతో కాంప్రమైజ్ అయినా రాష్ట్రస్థాయిలో పేరొందిన నేతలు అంత సులువుగా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదనేన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News