Friday, December 20, 2024

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్..!

- Advertisement -
- Advertisement -

ఎవరూ గెలుస్తారు, ఎవరూ అధికారంలోకి వస్తారు, ఏ అభ్యర్థికి ఎంత ఆధిక్యత
వస్తుందన్న దానిపై బెట్టింగ్

మనతెలంగాణ/హైదరాబాద్: ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. గత ఎన్నికలకు భిన్నంగా పొత్తులు పెట్టుకోవడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇదే అదునుగా సందట్లో సడేమియాల కొందరు బెట్టింగ్స్‌కు తెరలేపారు. ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్ ఎపిలోనూ జోరుగా సాగటం విశేషం. ఈమధ్యే క్రికెట్ బెట్టింగ్ అయిపోయింది. దీంతో తెలంగాణ పాలిటిక్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగడం విశేషం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందంటూ జోరుగా సాగిన బెట్టింగ్స్ క్రమంగా బిఆర్‌ఎస్ వైపు కూడా మొగ్గు చూపటం విశేషం. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం అవుతున్న క్రమంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు పార్టీల మధ్య బెట్టింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు. బిజెపి గెలిచే సీట్ల సంఖ్యపైనా బెట్టింగ్స్ జరగటం ఆసక్తి రేపుతోంది. మొదట్లో బిజెపి వైపు అస్సలు మొగ్గుచూపని బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు వాటిపైనా డబ్బులు పెట్టటానికి ముందుకు రావటం విశేషం.

ఎపి టిడిపి అభిమానులు కాంగ్రెస్ వైపు….
గత ఎన్నికల కంటే ఈసారి తెలంగాణ పాలిటిక్స్ పై ఎపిలో బెట్టింగ్స్ జోరుగా సాగటానికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్ధతు ప్రకటిస్తుండటం ఒకటి అయితే రేవంత్ రెడ్డిని టిడిపి అనుకూల వర్గం ఓన్ చేసుకోవటం మరో కారణం. ఎపి టిడిపి అభిమానులు మొత్తం కాంగ్రెస్ వైపు బెట్టింగ్స్ ఎక్కువ కాస్తున్నారు. ఇదే సమయంలో సిఎం కెసిఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. ఒకటి గజ్వేల్, మరొకటి కామారెడ్డి. కెసిఆర్ రెండు చోట్ల గెలుస్తాడా లేక ఒక చోట గెలుస్తాడా ఏ సీటులో గెలుస్తాడు, ఏ సీటులో ఓడిపోతాడన్న విషయమై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. అయితే ముఖ్య అభ్యర్థులకు ఎంత ఆధిక్యత వస్తుంది, గతం కన్నా ఎక్కువనా, తక్కువనా అన్న విషయాలపై బెటింగ్ జరగడం విశేషం.

ఫలితాల కోసం ఎదురుచూపు….
హైదరాబాద్ తోపాటు ఎపిలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి. వారం రోజులుగా మరింత ఎక్కువగా తెలంగాణ పాలిటిక్స్ డిస్కషన్ నడుస్తుంది. పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుండగా పోలింగ్ ముగిసి కౌటింగ్ మధ్య ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో చూడాలి. ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చేంత వరకు ఒక రేటుగా పార్టీల గెలుపోటములపై ఒక రకంగా బిజెపి పార్టీ గెలిచే సీట్లపై ఓ రకంగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. క్రికెట్‌లో బాల్ బాల్‌కు బెట్టింగ్ జరిగినట్లు తెలంగాణ పొలిటికల్ ఫీవర్ ఇప్పుడు బెట్టింగ్స్‌లోనూ మంట పుట్టిస్తుంది. పార్టీల గెలుపోటముల కంటే బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తామే గెలవాలి మాకే డబ్బులు రావాలన్న ఆశతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News