Sunday, January 19, 2025

కర్నాటకలో ముగిసిన ప్రచారం

- Advertisement -
- Advertisement -

 224 స్థానాల అసెంబ్లీ స్థానాలకు రేపే పోలింగ్, ఇసి ఏర్పాట్లు
 బిజెపితో కాంగ్రెస్ హోరాహోరీ
 ఫలితం ఈ నెల 13న
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన హోరాహోరీ ప్రచారానికి సోమవారం తెరపడింది. ఈ నెల 10వ తేదీ (బుధవారం) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సూచిక అవుతాయనే కోణంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. కర్నాటకలో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు బిజెపి విస్తృత ప్రచారానికి దిగింది. ఈ పార్టీ తరఫున ప్రధాని మోడీ కేంద్రీకృతంగా ప్రచారం సాగింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయి విమర్శలతో ఆయన ప్రచారం సాగించారు.

బిజెపి మొత్తం 206 బహిరంగ సభలను నిర్వహించింది. 90 రోడ్‌షోలను చేపట్టారు. కాగా ప్రధాని మోడీ ఏడు సార్లు రాష్ట్రానికి వచ్చి సభలలో పాల్గొన్నారు. ఈ సారి ఎక్కువగా రోడ్‌షోలకు ప్రాధాన్యత ఇచ్చారు. బిజెపి రాష్ట్రస్థాయి నేతలు 230 బహిరంగ సభలు నిర్వహించారు. కాగా వీరు 48 రోడ్ షోలలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా, అసోం సిఎం హిమంత బిస్వా శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చివరికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్మృతీ ఇరానీ, నితిన్ గడ్కరీ ఇతరులు కూడా వచ్చారు. కాంగ్రెస్ తరఫున ఎక్కువగా ప్రచార బాధ్యతలను రాహు ల్, ప్రియాంకలు తీసుకున్నారు. సోనియా గాంధీ హుబ్లీ లో బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున కన్నడిగ ఖర్గే పార్టీ తరఫున విశేషరీతిలో ప్రచారం సాగించారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 99 బహిరంగ సభలు నిర్వహించింది. 33 రోడ్‌షోలకు దిగింది.

కాగా రాహుల్ గాంధీ సభలు, రోడ్‌షోలకు భిన్నంగా ఎక్కువగా ప్రజలతో మమేకం కావడానికి, స్కూ టర్లపై తిరగడం, చిన్నారులతో ముచ్చటించడం వంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. జెడిఎస్ తరఫున దేవెగౌడ కేంద్ర బిందువుగా ప్రచారం సాగింది. ప్రచారం చివరి రోజున రాహుల్‌గాంధీ బస్సులో కొంతదూరం ప్రయాణించారు. కాలేజీ విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్స్‌తో ము చ్చటించారు. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. బెం గళూరులోని కన్నింగ్‌హమ్ రోడ్‌లోని ప్రఖ్యాత కేఫ్ కాఫీడేలో ఓ కప్పు కాఫీ తాగారు. తిరిగి ప్రచారం సాగించారు. కర్నాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలకు పో లింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల లెక్కింపు శనివారం ఈ నెల 13న జరుగుతుంది. 224 అసెంబ్లీ స్థానాల కర్నాటకలో అధికార స్థాపనకు అవసరం అయి న బలం 113 సీట్లు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,21,73,579. వీరిలో 2.62 కోట్ల మంది పురుషులు, కాగా 2.59 మంది ఆడవారు.

సర్కార్‌ను కూల్చడానికి కన్నడిగులు సిద్ధం: ప్రియాంక
కర్ణాటకలో అవినీతి సర్కారును కూల్చడానికి కన్నడిగులు సిద్ధంగా ఉన్నారని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజ యం సాధిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాం కగాంధీ స్పష్టంచేశారు. బెంగళూరులో ప్రచారానికి చివరి రోజైన సోమవారం జరిగిన రోడ్‌షో సందర్భంగా ప్రియాంకగాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కర్ణాటక ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే సంఖ్యను తాను ఊహించలేనని, ప్రజల నుంచి ఎలాంటి స్పందన తమకు వస్తుందో తాము చూడగలమని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News