Saturday, November 23, 2024

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. నగరంలో రాజకీయ వేడి

- Advertisement -
- Advertisement -

నగరంలో రగులుకుంటున్న రాజకీయ వేడి
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థుల పాదయాత్రలు
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు
ప్రచారాలతో బిఆర్‌ఎస్ జోరు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో నగరంలో పూర్తిగా రాజకీయ వేడి రగులుకుంది. ఇప్పటి వరకు అధికార బిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంతో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాద యాత్రల పేరుతో బస్తీల బాట పట్టిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైయ్యారు. ఇదంతా చూస్తున్న ఇతర పార్టీలకు చెందిన అశావాహులు తమకే టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్న పలువురు సైతం ప్రచారాన్ని ప్రారంభించారు. తీర టికెట్ ఖరారు అయితే ప్రచారంలో తాము ఎక్కడా వెనుకబడిపోతామోనన్న భయం తో బిజెపి నేతలు సైతం తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

తమ ప్రచారంలో భాగంగా టికెట్ ఖరారైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల ఆశావహులు సైతం ఆత్మీయ సమ్మేళనం పేరుతో వివిధ కుల సంఘాలతో ఎక్కడిక్కడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏలాంటి బ్యానర్లు లేకుండా సాధాసీదాగా సమావేశాల ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులు తమను గెలిపిస్తే ఏమి చేయనున్నామో చెబుతూ ఓట్లు రాబట్టుకునే యత్నాలు మొదలు పెట్టారు. వీరంతా ఉదయం పాదయాత్రలు, మధ్యాహ్నం ఆత్మీయ సమ్మేళనాలు, సాయంత్రం తిరిగి ఇంటింటి ప్రచారంతో అభ్యర్థులు రోజంతా బిజీ బిజీగా గడుపుతున్నారు.

ప్రచారంలో అందరి కంటే ముందున్న బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ పార్టీ గత రెండు నెలల కిత్రమే అభ్యర్థులు ప్రకటించడమే కాకుండా ఇటీవలే బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన చేతుల మీదగా బి ఫామ్స్‌ను సైతం అందజేయడంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందుకుగా దూసుకుపోతున్నారు. కూకట్‌పల్లిలో మాదావరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌లో వివేకానంద, మల్కాజ్‌గిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి, ఎల్‌బినగర్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లిల్లో అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాధ్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, సనత్ నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్, అంబర్‌పేట్‌లో కాలేరు వెంకటేశం, కంటోన్మెంట్‌లో లాస్యనందిత, సికింద్రాబాద్‌లో టి.పద్మారాలు పాదయాత్రతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వీరంతా ఇప్పటికే మొదటి విడుత ప్రచారం పూర్తి చేసిన వీరంతా బి ఫామ్స్ అందకున్న తర్వాత నామినేషన్ల పర్వం నాటికి రెండవ దఫా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తద్వారాలో గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బిఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లును సాధించేందుకు సమాయత్తం అవుతోంది.

ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం
గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం సైతం ఊ పందుకుంది. ఆ పార్టీ గత ఆదివారం మొదటి విడుతగా 55 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులోని గేటర్‌లోని పరిధిలో ఉన్న 24 నియోజవర్గాలకు గాను 14 ప్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో వారంతా ప్రచారం నిమగ్నమైయ్యారు. మరోవైపు బుధవారం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియంకా గాంధీలు ములుగు నియోజకవర్గం బసుయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టడంతో సీట్లు ఖరారైన అభ్యర్థులు సైతం బుధవారం గ్రేటర్‌లో పలు ప్రాంతల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న హనుమంతరావు, కుత్బుల్లాపూర్‌లో కోలన్ హనుమంత్‌రెడ్డి, ఉప్పల్ లో ఎం. పరమేశ్వర్‌రెడ్డి, ముషీరాబాద్ లో ఎం. అంజన్ కుమార్ యా దవ్, సనత్‌నగర్‌లో డాక్టర్. కోటా నీలిమా, నాంపల్లి లో ఫిరోజ్‌ఖాన్, గోషామహాల్‌లో ఎం. సునీత మలక్‌పేట్‌లో షేక్ అక్బర్, చంద్రాయణ్‌గుట్ట నుంచి బోయ నా గేష్, సికింద్రాబాద్‌లో ఎ.సంతోష్ కుమార్‌లు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

పూర్తిగా వెనకబడి బిజెపి
గ్రేటర్ ఎన్నికల ప్రచారం బిజెపి పార్టీ పూర్తిగా వెనకబడింది. ఆ పార్టీ ఇప్పటీ వరకు అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయకపోవడంతో టికెట్ తమకే వస్తుందన్న నమ్మకమున్న పలువురు ఆశావాహులు తమ అనుచరగణంలో కలిసి కొంత మేర ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల కంటే బిజెపి ఎన్నికల ప్రచారం పూర్తిగా వెనుకబడింది. అయితే గురువారం బిజెపి అధిష్టానం తొలి జాబితా ప్రకటించే అవకాశాలుండడంతో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు దానికి ఎదురుచూస్తున్నారు. మరో వైపు టిడిపి సైతం ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేయనున్నామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించడం, ఆ పార్టీ అభ్యర్థులు సైతం తర్వలోనే ఖరారు కానున్నారు. అంతేకాకుండ బిఎస్‌పి ఇప్పటికే పలువురు అభ్యర్థుల ప్రకటించడమే కాకుండా మం గళవారం ఆ పార్టీ మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. దీంతో ఆపార్టీ చెందిన పలువురు అభ్యర్థులు ప్రచారాన్ని అంతా సిద్దం చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News