Wednesday, January 22, 2025

మిర్యాలగూడలో రూ. 5 కోట్ల బంగారం సీజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల నిర్వహణతో పాటు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మిర్యాలగూడలో కోట్లాది రూపాయల బంగారం పట్టుకున్నారు. నల్గొండ జిల్లా ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు.

వాహనంలోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లకూడదు. ఒకవేళ అంతకు మించి నగదు వాళ్లు తీసుకెళ్తున్నట్లయితే అందుకు సంబంధించిన డాక్యమెంట్స్, ఇతర పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఫిర్యాదుల కోసం సి విజిల్ యా ప్ ఉంది. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ లో వెబ్ ద్వారా, కాల్ సెంటర్ 1950కి కాల్ చేసి ఫిర్యా చేయవచ్చు. ఈ మేరకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News