Wednesday, April 9, 2025

జనసేనకు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించింది. బుధవారం మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని జనసేన కార్యాలయానికి తెలియజేసింది. రానున్న ఎన్నికల్లో జనసేనకు గ్లాసు గుర్తును కేటాయించాలని ఏపి ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పార్టీ లీగల్‌సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు అందజేశారు.

జనసేనలో పలువురు ప్రముఖల చేరికలు
జనసేన పార్టీలోకి బుధవారం పలువురు ప్రముఖలు చేరారు. ప్రముఖ నృత్యదర్శకుడు జానీ, నటులు పృధ్వీరాజ్‌లకు పార్టీఅధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పార్టీలో చేరిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News