Wednesday, January 22, 2025

మోగిన నగారా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎ న్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒ కే జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలిం గ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధా న కమిషనర్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. పో లింగ్ తేదీలు, ఇతర వివరాలను మీడియాకు వివరించారు. మహారాష్ట్రలో నవంబర్ 20 (బుధవారం)న పోలింగ్ జరగనుండగా, జా ర్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని, ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నట్టు వెల్లడించారు. అలాగే దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

కేరళలోని వయనాడ్, మహారాష్ట్ర లోని నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు వే ర్వేరు రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వయనాడ్ లోక్‌స భ నియోజకవర్గంతోపాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న, నాందేడ్ లోక్‌సభ సీటుతోపాటు ఉత్తరాఖండ్ లోని ఒక అసెంబ్లీ స్థా నానికి నవంబర్ 20న పోలింగ్ నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.మహారాష్ట్రలో 36జిల్లాల్లో మొత్తం 288 ని యోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ స్థానాలున్నాయి. 2024 అక్టోబర్ 15 నాటికి మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు తెలిపారు.

ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 13న తొలి విడత, నవంబర్ 20 న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. తొలివిడతకు అక్టోబర్ 18న నోటిఫికేషన్, వెలువడుతుంది. అక్టోబర్ 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. తొలివిడతలో 43 నియోజకవర్గాలకు నవంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. రెండో విడత నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడుతుంది. అక్టోబర్ 29తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 1తో ముగుస్తుంది. నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
ఝార్ఖండ్‌లో 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉండగా, వీటిలో జనరల్ 44 సీట్లు కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున ఉన్నాయి. మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు, 1.31 కోట్ల మంది పురుషులు, 66.84 లక్షల మంది యువ
ఓటర్లు కాగా, 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్
గెజిట్ నోటిఫికేషన్ జారీ: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణకు తుది గడువు : అక్టోబర్ 29
నామినేషన్ల ఉపసంహరణ గడువు : నవంబర్ 4
పోలింగ్ తేదీ : నవంబర్ 20
ఓట్ల లెక్కింపు : నవంబర్ 23

మొత్తం 288 మంది శాసన సభ్యులు ఉన్న మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీకి ఈ ఏడాది నవంబరు 26తో గడువు ముగియనుంది. అలాగే 81 స్థానాలున్న ఝార్ఖండ్ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలతో ఏర్పాటైన మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఝార్ఖండ్ జేఎంఎం కాంగ్రెస్ పక్షాలతో కూడిన ప్రభుత్వం కొనసాగుతోంది.

ఇవిఎం బ్యాటరీ క్యాలిక్యులేటర్ వంటిది
ఇవిఎం బ్యాటరీ క్యాలిక్యులేటర్ వంటిదని ఎన్నికల కమిషన్ (ఇసి) మంగళవారం స్పష్టం చేసింది. పేజర్లు వంటి వంటవాటితో ఇవిఎంలను తారుమారు చేయవచ్చన్న ఆరోపణలను ఇసి తోసిపుచ్చింది. హర్యానాలో వివిధ పోలింగ్ కేంద్రాల వ్యాప్తంగా ఇవిఎం బ్యాటరీ స్థాయిల్లో తేడా వల్ల ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందని కాంగ్రెస్ ఆరోపించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా సిఇసి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఇవిఎంల వాడకాన్ని సమర్థించారు. అవి ‘పూర్తిగా భద్రమైనవి, దృఢమైనవి’ అని ఆయన పేర్కొన్నారు. గత 1520 ఎన్నికలకు సంబంధించిన వివిధ ఫలితాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇవిఎంల లోపాలు అని అర్థం తీసుకోరాదని, అవి వోటర్ల నిర్ణయాలను ప్రతిబింబిస్తుంటాయని ఆయన నొక్కిచెప్పారు.

‘ఇవిఎంలలో క్యాలిక్యులేటర్ బ్యాటరీ వలె ఒకేసారి వాడే బ్యాటరీ ఉంటుంది, మొబైల్ బ్యాటరీ కాదు’ అని రాజీవ్ కుమార్ చెప్పారు. ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా పేజర్లను ఇజ్రాయెల్ హ్యాక్ చేసినట్లుగా ఇవిఎంలను తారుమారు చేయవచ్చునన్న కాంగ్రెస్ నేత రషీద్ ఆల్వి వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ‘పేజర్లను కనెక్ట్ చేయవచ్చు కానీ ఇవిఎంలను కాదు’ అని ఆయన అన్నారు. ఇవిఎంలలో బ్యాటరీలతో సహా మూడు అంచెల భద్రత ఉంటుందని సిఇసి స్పష్టం చేశారు. ‘పోలింగ్ ప్రారంభానికి 56 నెలలకు ముందు ఇవిఎంల తొలి స్థాయి తనిఖీ జరుగుతుంది. వోటింగ్ జరగడానికి 56 రోజుల ముందు ఇవిఎం ఏర్పాటు చేస్తారు. అదే రోజు కొత్త బ్యాటరీ అమరుస్తారు’ అని ఆయన తెలియజేశారు. ఇవిఎంను సీల్ చేసిన అనంతరం రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇవిఎంపైన, బ్యాటరీపైన సంతకం చేస్తారని ఆయన తెలిపారు. ‘అటుపిమ్మట ఇవిఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు రవాణా చేసి, ఏజెంట్ల సమక్షంలో డబుల్ లాక్ చేస్తారు. ఆ మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేస్తారు’ అని ఇసి వివరించారు.

ఎగ్జిట్ పోల్స్‌కు ఏ శాస్త్రీయతా లేదన్న సిఇసి
ఎగ్జిట్ పోల్స్‌కు ఎటువంటి శాస్త్రీయతా లేనప్పటికీ భారీ అంచనాలను సృష్టిస్తున్నాయని సిఇసి అన్నారు. ఇటువంటి అంచనాలతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ విషయంలో మీడియా సహా అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సిఇసి సూచించారు. ముఖ్యంగా మీడియా సంస్థలకు స్వీయ నియంత్రణ అవసరమని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌తో తమకు సంబంధం ఉండదని కూడా సిఇసి స్పష్టం చేశారు. అయితే, ‘శాంపిల్ సైజ్ (సర్వే పరిధి) ఏమిటి? ఎక్కడ చేశారు? ఫలితాలు అందుకు అనుగుణంగా రాకపోతే బాధ్యత ఎవరిది? అనే విషయమై భాగస్వామ్య పక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంచనాలు, ఫలితాల మధ్య అంతరం నిరాశకు దారి తీస్తుంది’ అని రాజీవ్ కుమార్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News