Friday, December 20, 2024

గ్రామ పంచాయతీ ఎన్నికలకు వేళాయే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పంచాయతీ ఎన్నికల సందడి షురూ అయింది. వచ్చే జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 2019లోఎన్నికలు జరగ్గా వాటి పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుంది. అధికారులు సర్పంచుల పదవి కాలం ఐదేళ్లు ముగిసేలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీల పదవికాలం ముగియడానికి మూడు నెలలోపు ఎన్నికల నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

దీని కోసం పోలింగ్ సిబ్బంది నియామకం, గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం వారికి శిక్షణ కూడా ఇవ్వాలని తెలిపింది. 200 ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 ఓట్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని సూచించారు. ప్రతివార్డులో కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, ఒకవార్డులో 650 మంది ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News