Wednesday, January 15, 2025

తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బిఆర్ఎస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కె. కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ  ఏర్పడింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం వివరించింది. కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News