Friday, November 22, 2024

అచ్చెన్నాయుడుకి ఎన్నికల సంఘం నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఎపి అసెంబ్లీ ఎన్నికల వేళ టిడిపి నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సిఎం జగన్ పై ఇరువురు నేతలు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంఎల్‌సి లేళ్ల అప్పిరెడ్డి ఇసికి ఫిర్యాదు చేశారు.

దీంతో కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సిఇఒ ముఖేష్‌కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. కాగా, టిడిపి అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అందుకు తగు వివరణ ఇవ్వాలని ఇసి ఆదేశించింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని చంద్రబాబుకి ఇసి నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఇసి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News