- Advertisement -
అనంత్‌నాగ్(జమ్మూకశ్మీర్): ఎన్నికల సంఘం ఇప్పుడు బిజెపి శాఖలా పనిచేస్తోందని, బిజెపి సూచనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తోందని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ శనివారం ఆరోపించారు. “ఎన్నికల సంఘం ఇప్పుడు స్వతంత్ర సంస్థగా పనిచేయడంలేదు” అని కూడా ఆమె స్పష్టం చేశారు. “బిజెపి హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మతపరంగా నిర్వహిస్నున్నప్పుడు భారత ఎన్నికల సంఘం మౌనంగా ఉండిపోయింది. అది స్వతంత్రంగా వ్యవహరించడంలేదు” అని మెహబూబా ముఫ్తీ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 73.23 శాతం ఓటింగ్ జరిగింది. సొలాన్‌లో అత్యధికంగా 76.82 శాతం పోలింగ్ జరిగింది. కాగా సిమ్లాలో 69.88 శాతం మాత్రమే పోలయింది. ఇక ఉనాలో 7.69 శాతం, కుల్లులో 76.15 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ శనివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది.
- Advertisement -