Thursday, February 13, 2025

ఏకగ్రీవమైన చోట నోటాకు నో

- Advertisement -
- Advertisement -

పల్లెపోరులో బలవంతపు
ఏకగ్రీవాలకు చెక్ పెట్టేందుకు
ఇదే సరైన మార్గమని
కొన్ని పార్టీల మద్ద్దతు
నిరాకరించిన కాంగ్రెస్
పార్టీ మద్దతు తెలిపిన
బిఆర్‌ఎస్ తుది నిర్ణయం
ప్రభుత్వానిదేనన్న ఇసి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరగ బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట ‘నోటా’తో ఎన్నిక నిర్వహించాలనే ప్రతిపా దన ఈసారి అమలులోకి రావడం లేదని తెలు స్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నోటాను ఒ క కల్పిత అభ్యర్థిగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సం ఘం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వ హించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపి, ఎంఐఎం, వామపక్షాలు, టిడిపి, జనసేన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ తరహా విధానం ఇప్పపటికే పలు రాష్ట్రాలు పాటిస్తున్న నేఫథ్యంలో రాష్ట్రంలోనూ ఈ విధానం అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం సేకరించింది. ఈ అంశంపై ప్రధాన పా ర్టీలు నోటాను అభ్యర్థిగా చేర్చాలని మద్దతు తెలు పగా, కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవా న్ని అడ్డుకునేందుకు నోటాను కల్పిత అభ్యర్థిగా చేర్చడమే ఉత్తమం అని పార్టీలు తమ అభిప్రా యాన్ని తెలిపాయి. ఈ అంశం ఇంకా చర్చల ద శలోనే ఉండటంతో ఈ సారి ఎన్నికల్లో ఏకగ్రీవ మైన స్థానాల్లో నోటాతో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రా యాలు వ్యక్తమయ యాయి. ఈ సమావేశంలో నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతి రేకించింది. ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహిం చడం ఖర్చుతో కూడిన అంశం అని అభిప్రాయ పడింది. ఒకరి కంటే ఎ క్కువ అభ్యర్థులు పోటీ లో ఉంటే నోటాతో ఎన్నిక నిర్వహించాలని సూ చించింది. ఈ అంశంపై బిఆర్‌ఎస్ స్పందిస్తూ ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బలప్రదర్శ న చేసే అవకాశం ఉందని, నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించింది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్ణయానికి అధికారం లేదని పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసు కోవాలని ఎస్‌ఇసి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News