Monday, December 23, 2024

ఎన్నికలకు సిద్ధం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దానికి అగుణంగా వెంటనే అధికారులను బదిలీలు చేయాలని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానికి అనుగుణంగా ఎంసిహెచ్‌ఆర్‌డిలో జిల్లాల కలెక్టర్లు,ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లతో ఎన్నికల కమిషన్ అధికారులు రెండు రోజులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులకు బదిలీల గురించి పలు ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ అధికారుల బదిలీలు జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఎక్కడా లోపాలకు తావు లేకుండా కానిస్టేబుల్ నుంచి ఇన్స్‌స్పెక్టర్ల వరకు పారదర్శకంగా ట్రాన్స్‌ఫర్లు చేస్తున్నారు.

కొంత మంది కానిస్టేబుళ్లు సూధీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రాంతాల నుంచి బదిలీ చేశారు. తర్వాత ఎస్సైలను బదిలీ చేశారు, ఎస్సైల బదిలీల్లో ఒత్తిడి వచ్చినా కూడా ఎక్కడా లొంగకుండా పారదర్శకంగా వారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. మరో దఫా లీస్టు తీసి ఎస్సైలను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు, వారం పదిరోజుల్లో మరో లిస్టులో ఎస్సైల బదిలీ జాబితా రానున్నట్లు తెలిసింది. కొందరు ఎస్సైలు సుదీర్ఘకాలంలో ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాంటి గుర్తించి ముందుగానే బదిలీ చేసి వేరేజిల్లాకు కేటాయించారు. చాలా కాలం నుంచి మేడ్చెల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఎస్సైలను బదిలీ చేసి రంగారెడ్డి జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. ఇలాంటి వారిలో ఇన్స్‌స్పెక్టర్లు ఉండడంతో వారిని కూడా బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 31వ తేదీ లోపు పోలీసు అధికారుల బదిలీ పూర్తి చేసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర భావిస్తున్నారు.

మూడేళ్లు పనిచేస్తే….
కొందరు ఇన్స్‌స్పెక్టర్లు మూడేళ్ల నుంచి ఒకే జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు వారిని వెంటనే బదిలీ చేశారు, అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో పనిచేసిన నియోజకవర్గంలో ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలు ప్రస్తుతం పనిచేస్తుంటే వారిని తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ చేశారు. వారిని వేరే జిల్లాకు బదిలీ చేయడమో లేకుండా సిపి ఆఫీస్‌కు అటాచ్డ్ చేయడమే చేస్తున్నారు. సొంత ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులను కూడా పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర బదిలీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News