- Advertisement -
హైదరాబాద్ ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ఊపందుకుంది. రాష్ట్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈ నెల 23 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,26,02 ,799 ఓటర్లు, ఇందులో 1,62,13,268 మంది పురుషులు, 1,63,02,261మంది స్త్రీలు, 2,676 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,406 మంది, విదేశాలలో ఉంటున్న 2,944 మంది కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,99,667 మంది యువ ఓటర్లు ఉండగా ఇందులో 90 శాతం మంది తొలిసారిగా ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 45,36,852 మంది ఓటర్లు ఉండగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లు, భద్రాచలంలో అతి తక్కువగా 1,48,713మంది ఓటర్లు ఉన్నారు.
- Advertisement -