- Advertisement -
హైదరాబాద్: రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15వ తేదీన నామినేషన్లకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది.
తెలంగాణలో మూడు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 56 మంది రాజ్యసభ సభ్యుల పదవికాలం ఏప్రిల్‌లో ముగియనుంది. వీరిలో తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్యయాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఏపి నుంచి సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు.
- Advertisement -