Sunday, January 19, 2025

ఆతిశీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీకి శుక్రవారం ఎన్నికల కమిషన్(ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూఏ అత్యంత సన్నిహితుల ద్వారా ఆ పార్టీ తనను సంప్రదించిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సోమవారం మధ్యాహ్నం లోగా సరైన ఆధారాలు చూపించాలని కోరింది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

బీజేపీలో చేరిక విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవాలని, అందుకు తగిన ఆధారాలు మీ వద్ద ఉన్నాయని మేం భావిస్తున్నాం. వాటిని ఈసీకి అందించాలని కోరుతున్నాం’ అని ఈసీ తన నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన ఆతిశీ.. ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ సంస్థా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ మెయిల్ ద్వారా తనకు నోటీసులు అందడానికి గంట ముందే ఈ విషయం బీజేపీ నుంచి మీడియాకు తెలిసిందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News