Monday, January 20, 2025

ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో మంచాలకే పరిమితమైన వారి కోసం
ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు
క్యూ లైన్‌లో నిలబడకుండా నేరుగా ఓటు వేసేలా జిల్లా అధికారుల ఏర్పాట్లు

మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ఓటుహక్కు పొందేందుకు, వినియోగించుకునేందుకు సరళమైన విధానాలు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో మంచాలకే పరిమితమైన వారు, కొవిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారిలో పోస్టల్ బ్యాలెట్ (12 ఫారం) ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వీరితో పాటు ఇంకా చాలా మంది అసహాయులు ఈ నెల 30వ తేదీన క్యూ లైన్‌లో నిలబడకుండా నేరుగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది.

గర్భిణులకు పికప్ అండ్ డ్రాప్
వీరితో పాటు నెలలు నిండుతున్న గర్భిణులకు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోయేందుకు (పికప్ అండ్ డ్రాప్) ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులకు, బూత్ లెవల్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే గుర్తించిన ఓటర్లకు పోలింగ్ వారీగా ప్రత్యేక వాహనాలు (ఆటోలు, టాటా ఎస్ వంటివి) ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఓటర్లు, వాహనాల జాబితాను రూపొందించారు. పోలింగ్ రోజు ఏర్పాట్లలో తేడా రాకుండా చూడాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనీసం ఒకటి లేదా అవసరాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ ఆటోలు, ఓటర్లకు సహకరించేందుకు వాలంటీర్లను సైతం జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News