Wednesday, January 22, 2025

తెలంగాణ డిజిపి సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎలక్షన్ కమిషన్ (ఇసి ) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెలువెడుతున్న సమయంలోనే డిజిపి అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని డిజిపి కలుసుకుని చర్చ జరపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పీటీఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరపాలని డిజిపి అంజనీకుమార్ తో రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యహ్నం కలిసి చర్చించడం తెలిసిందే. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించడంతో డిజిపిపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News