Monday, December 23, 2024

శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం ఇసి అధికార ప్రతినిధి తమ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం(మార్చి 16)సాయంత్రం 3 గంటలకు జరిగే విలేకరుల సమావేశంలో ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రతికా సమావేశాన్ని సిసికి చెందిన సోషల్ మీడియా వేదికలపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని ఆయన తెలిపారు. కాగా, 2019లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ఇసి ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో ఎన్నికల సన్నద్ధతపై ఇసి ఇప్పటికే తన సమీక్షను పూర్తి చేసింది. ఈ వారంలో జమ్మూ కశ్మీరులో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను సిఇసి రాజీవ్ కుమార్ సమీక్షించడంతో ఎన్నికల సంఘం దేశవ్యాప్త ్సమీక్ష పూర్తయినట్లయింది.

ఎన్నికలు జరగనున్న 543 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో ప్రాతీయ, జాతీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు జాబితాలలో 267 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాల ద్వారా 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ ఎన్నికలలో 370 స్థానాలను గెలుచుకుంటామని అధికార బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్‌డిఎ కూటమికి 400కి పైగా స్థానాలు లభిస్తాయని కూడి బిజెపి ఆశిస్తోంది. అయితే వివిధ రాష్ట్రాలలో సీట్ల సర్దుబాట్ల ద్వారా బిజెపి దూకుడును అడ్డుకోవాలని భావిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి కీలక రాష్ట్రాలలో భాగస్వామ్య పక్షాల మధ్య అవగాహన కుదర్చుకోవడంలో వైఫల్యం చెందింది. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలలో తామే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు.

కాంగ్రెస్‌కు కూడా ఒంటరి పోటీ అనివార్యంగా కనపడుతోంది. ఇక బీహార్‌లో ఇండియా కూటమి రూపకర్త అయిన జెఇయు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమిని విడిచిపెట్టి మళ్లీ ఎన్ణడిఎ గూటికి తిరిగి వచ్చారు. ఉత్తరర్ ప్రదేశ్‌లో ఒకప్పుడు ఇండియా కూటమిలో మిత్రపక్షమైన ఆర్‌ఎల్ సైతం తాజాగా ఎన్‌డిఎలో చేరిపోయింది. కేరళలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఐ, కాంగ్రెస్ పరస్పరం తలపడే పరిస్థితి ఏర్పడింది. వయనాడ్‌లో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి రాహుల్ గాంధీపై సిపిఐ అన్నీ రాజాను తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటివరకు 82 సీట్లకు మాత్రమే తన అభ్యర్థులను ప్రకటించింది. మరి కొన్ని రాష్ట్రాలలో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తమిళనాడులో డిఎంకె, తెలంగాణలో బిరాఎస్, ఉత్తర్ ప్రదేశ్‌లో బిఎస్‌పి వంటి ప్రాంతీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సమాయత్తమవుతున్నాయి. కర్నాటకను మినహాయిస్తే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు కానున్నాయి.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఒక్క లోక్‌సభ సభ్యుడు లేకపోవడం గమనార్హం. కర్నాటకలో 28 స్థానాలలో 25 స్థానాలను గత ఎన్నికలలో బిజెపి గెలుచుకుంది. తెలంగాణలో బిజెపి గత ఎన్నికలలో 4 స్థానాలలో గెలుపొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, దక్షిణ భారతంపై బిజెపి ప్రధానంగా దృష్టి సారించింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజెడితో బిజెపి పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, జనసేనతో బిజెపి సొంత్తు ఏర్పర్చుకుంది. పంజాబ్‌లో అకాలీదళ్‌తో బిజెపి సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News