ఢిల్లీ: శనివారం 18వ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంది. జూన్ 16తో ప్రస్తుత లోక్ సభ గడువు ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో మేలోగా ఎన్నికలు జరగాల్సిఉంది. గత లోక్ సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. గత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించింది ఎన్నికల కమిషన్. గత లోక్ సభ ఎన్నికలకు మే 23న ఓట్లు లెక్కించారు. ఈసారి కూడా ఏప్రిల్ -మేలో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.