న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారంనాడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గోయెల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అయితే గో యెల్ తన రాజీనామాకు కారణాలు ప్రకటించలే దు. ఆయన పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికీ అనూహ్యంగా మధ్యలోనే వైదొలిగిన తీరు దే శంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరో ఐ దారు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు ప్రకటన వెలువడనుండగా గోయెల్ రాజీనామా చేయడం పలు రకాల ఊహాగానాలకు కూడా తావిచ్చింది.
గోయె ల్ రాజీనామాతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సం ఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) రా జీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఇప్పటికే ఒక కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని గోయెల్ చెప్పినట్లు అత్యున్నత స్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వం ఆయనను వారించినప్పటికీ తన నిర్ణయంపై ముందుకే వెళ్లారని ఆ అధికారి వివరించారు. ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, గోయెల్ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. నవంబర్ 18, 2022లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తెల్లవారే ఆయనను ఎన్నిల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. గోయెల్ నియామకాన్ని సమర్థిస్తూ గత ఏడాది తీర్పు వెలువరించింది.