Wednesday, January 22, 2025

మంత్రి గంగుల ఎన్నిక వివాదం.. హైకోర్టుకు బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. గంగుల ఎన్నిక చెల్లదంటూ బిజెపి నేత బండి సంజయ్ పిటిషన్ వేశారు. సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టుకు సంజయ్ హాజరయ్యారు. బండి సంజయ్ వేసిన ఈ పిటిషన్‌పై తర్వాతి విచారణను ఈ నెల 27కి ధర్మాసనం వాయిదా వేసింది. అయితే, గంగుల కమలాకర్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్‌పై ఇటీవల హైకోర్టు విచారణ చేపట్టింది. 2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. గంగుల ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించేలా ఇసిని ఆదేశించాలని కోరారు. ఇన్నేళ్ల తర్వాత పత్రాలను ఎన్నికల అధికారులే ఇవ్వా లనడం అభ్యంతరమని గంగుల వాదించారు. మంత్రి వాదన తోసిపుచ్చిన ధర్మాసనం ఎన్నికల ఖర్చుకు సంబంధించిన పత్రాలను పొన్నం ప్రభాకర్ కోరడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పొన్నం ప్రభాకర్ మధ్యంతర పిటిషన్ హైకోర్టు అనుమతించింది. విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News