Tuesday, November 5, 2024

ఆ ఉద్యోగులకు ప్రోత్సాహక గౌరవ వేతనం చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిసిన ట్రెసా ప్రతినిధి బృందం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమర్దవంతంగా విధులు నిర్వహించిన రెవెన్యూ అధికారులకు ప్రోత్సాహక గౌరవ వేతనం చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధి బృందం పేర్కొంది. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి జిల్లా కలెక్టర్ల ప్రతిపాదనల ప్రకారం అదనపు బడ్జెట్ కేటాయించాలని కోరారు. దీనిపై ఎలక్షన్ సీఈఓ సానుకూలంగా స్పందించి త్వరలో రిటర్నింగ్ అధికారులకు, సహాయక రిటర్నింగ్ అధికారులకు, సిబ్బందికి ప్రోత్సాహక వేతనం అందిస్తామని,అదనపు బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు సంయుక్త కార్యదర్శి నజీమ్ ఖాన్,మునీర్, నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి,జగిత్యాల్ జిల్లా అధ్యక్షులు వకీల్,డిప్యూటీ కలెక్టర్ మంగీలాల్,సభ్యులు సతీష్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News