Wednesday, January 22, 2025

పట్నంలో ఎన్నికల హీట్?

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తు ఎన్నికలు వస్తాయనే ధీమాతో అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆగష్టు, సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో పా వులు కదుపుతున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంతోపాటు రంగారెడ్డి జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల పేరుతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని తూర్పు భాగంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికార పార్టీ అం డదండలతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకవచ్చి అభివృ ద్ధ్ది చేశారని ప్రజలలో నమ్మకం కలిగించే విధంగా ముఖ్య మంత్రి కెసిఆర్ ఆదేశించిన మేరకు ప్రతి గ్రామం, మండల, నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు జరిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి శభాష్ అనుపించుకున్నారు.

ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు వస్తాయనే ధీమాతో అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆగష్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వా న్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం .దీంతో రాష్ట్రంతో పాటు రం గారెడ్డి జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు సభలు, సమావేశాల పేరుతో ప్రజలకు దగ్గరవుతున్నారు.ముఖ్యంగా రం గారెడ్డి జిల్లాలోని తూర్పు భాగంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికార పార్టీ అండదండలతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకవచ్చి అభివృద్ధ్ది చేశారని ప్రజలలో నమ్మకం కలిగించే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన మేరకు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ వ్యా ప్తంగా ఆత్మీయ సమావేశాలు జరిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి శభాష్ అనుపించుకున్నారు.

ఆ తరువాత వెంటనే జూన్ 2 నుండి 22 వరకు దశాభ్ది ఉత్సవాల పేరుతో ప్రతి రోజు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు మరింత దగ్గర అవుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధ్దంగా ఉన్నామనే సంకేతం ప్రజలలో చెప్పకనే చెప్పినట్లు కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో పాటు అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ , బిజెపి, వామపక్షాలు, బిఎస్‌పి పార్టీలు సైతం ప్రజలతో మమేకమై ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళుతు మేము సైతం తక్కువేమి కాదంటూ ఎన్నికల కదన రంగంలోకి దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గెలుపు ధీమాతో కాంగ్రెస్ …
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం ఉన్నప్పటికి గ్రూపు రాజకీయాలలో కార్యకర్తలు సతమత మవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించక పోవడంతో అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆరు నెలల ముందె అభ్యర్థిని ప్రకటిస్తే ఎదో రకంగా ప్రజల వద్దకు వెళ్ళి మమా అనిపించె పరిస్థితి ఉండెదని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మాత్రం ఎవరికి వారే మేమే ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అధిస్థానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చెప్పలేము.

కానీ ఇబ్రహీంపట్నం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలనే ఉద్దెశంతో సీనియర్ కాంగ్రెస్ శ్రేణులు తపన పడుతున్నారు. టీపీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో ఒకరిద్దరు , మరో నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశీస్సులతో పట్నం అసెంబ్లీ బరిలో పోటి చేసి గెలుస్తామనేదీమాతో ఉన్నారు. మరో బీసీ సామాజిక సీనియర్ నేత ఇప్పటికే రంగంలో నేనూ కూడ అంటు రేవంత్‌రెడ్డిని కలిసినప్పటి నుండి గ్రామాలలో కరపత్రాలతో ,సోషల్ మీడియాలలో ప్రతి రోజు ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య టీపీసీసీ ఆదేశాల మేరకు హత్ సే హత్ జోడో యాత్రతో గడప గడపకు వెళ్లి రాహుల్ గాందీ చేపట్టిన జోడో యాత్ర గురించి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ , రైతులకు నాణ్యమైనా విధ్యుత్ , ధరణి పోర్టల్ రద్దు , రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు , రూ.500 లకు గ్యాస్ సిలిండర్ అని చెప్పి ప్రచారం చేస్తు ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.

అధికార పార్టీతో పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు
ఎమ్మెల్యే గా గెలుపొందే అవకాశం …
మునుగోడు తరహాలో అధికార పార్టీ వామపక్షాలు పొత్తు లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉబయ క మ్యూనిస్టులకు సీటు కేటాయిస్తే ్త మరోసారీ ఎమ్మెల్యేగా గెలుపొందె అవకాశాలు లేకపోలేదు. కమ్యూనిష్టులు ని యోజకవర్గంలో చాపకింద నీరులా ప్రజలలో మమేకమై ప్ర జా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ మద్యనే బడుల్ బెడ్ రూం లు,ధరణి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై ఉద్యమాల బాట పట్టారు. గతంలో మూడు సార్లు కమ్యూనిష్టులు గెలుపొందిన అనుభవం ఉం ది. ఒక వేళా పొత్తు కదిరితె ఈసారీ ఇబ్రహీంపట్నం బరిలో బిఆర్‌ఎస్ మద్దతుతో పోటీలో ఉండె అవకాశం లేకపోలేదు. పొత్తు కుదరక పోయిన ఇబ్రహీంపట్నంలో సీపీఎం పార్టీ పోటీ అనివార్యం అంటు ఈ మద్య ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం ఇబ్రహీంపట్నం సభలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన విషయం తెలిసిందె. కాలం కలిసి వస్తే ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశం లేకపోలేదు.

మోడీపైనే ఆశలు
భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కేవలం ప్రధానీ మోడీపైనే ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం చేసిన అభివృద్ది పనులను తెలియ జేస్తు ప్రజల వద్దకు వెళుతున్నారు. సొంతంగా ప్రజా సమ్యలపై ఏనాడు పోరాటాలు చేసిన ధాఖలాలు లేవు. కేవలం నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్దిపై ఆదారపడి ఉన్నారు. గతంలో పోటీ చేసిన కొత్త అశోక్ గౌడ్ ఎన్నికలప్పుడు ఉన్నంత ఉషారుగా ఈ మద్య ఏలాంటి కార్యాక్రమాలలో కనిపంచలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్బంగా అప్పుడప్పుడు పార్టీ కార్యాక్రమాలలో పాల్గోనడం తప్పా పెద్ద చేసిందేమి లేదని విమర్శలు ఉన్నాయి. ఆ పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తారో చెప్పలేదు.

ఈ మద్యనే బువననగిరి పార్లమెంటు మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ పార్టీ కార్యాక్రమాలలో కనిపిస్తున్నారు. అభ్య ర్థి కూడ ఆయననే అంటు ప్రచారం చేసుకుంటున్నారు. దీని పై సీనియర్లు సైతం పార్టీ అధిస్థానంపై కత్తులు దూరుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కమ్యూనిష్టులతో, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌తో క య్యానికి కాలుదువ్విన సీనియర్లము కాదని నేడు కొత్త వారికి టికెట్ కేటాయిస్తే చూస్తు ఊరుకునేది లేదని సీనియర్‌లు సైతం ఆగ్రహాంతో ఉన్నారు. ఏది ఏమైన్పటికి సీనియర్ నేతలకు తప్పా ఈమద్య వలస వచ్చిన వారికి టికెట్ కేటాయిస్తే తమ దారీ చూసుకోవాల్సివస్తుందని ఆ పార్టీ అధిస్థానంపై ఆగ్రహాంతో ఉన్నారు.

తెదేపా, బిఎస్‌పిలు సైతం ‘పట్నం’ బరిలో
నియోజకవర్గంలో బిఎస్‌పి, తెదేపాలు ఉనికి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికి పార్టీలు ఆయా ప్రజా సమస్యలపై ఇప్పుడిప్పుడే పోరుబాట పట్టారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెదేపా నేత లు పూర్వ వైభం కోసం పాటు పడుతున్నారు. రాష్ట్ర తెదేపా అధ్యక్షులు కాసానీ జ్ఞానేశ్వర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రాజకీయ పరంగా , బందుత్వ పరంగా ఆయనకు మంచిపట్టుంది. ఆయన రాకతో కాస్తా పార్టీకి బలం చేకూరుతుందని ఆశించినప్పటికి పెద్ద గా తెదేపా బలం పుంజుకోవలంలో విఫలమైనారనే చెప్పవచ్చు. గత తెదేపా నాయకులు బిఆర్‌ఎస్ చేరడంతో ఆ పార్టీ నామ్‌కే వాస్తే అన్నట్లు ప్రజల వద్దకు వెళ్ళి తిరిగి సైకిల్ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు.

ఆపార్టీ అధినేత స్వర్గీయ ఎన్‌టిఆర్ వర్దం తి, జయంతీలు తప్పా ప్రజలకు సంబందించిన కార్యాక్రమాలు చేపట్టడం లేదని ఆపవాదు ఉంది. గత ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరుపున ఇబ్రహీంపట్నం నుండి పోటి చేస్తు రెండవ స్థానంలో ప్రజలు ఓట్లు వేశారు. మరో మారు ఇబ్రహీంపట్నం బరిలో బిఎస్‌పి తరుపున పోటీ చేసి సత్తా చాటుకుంటామని బిఎస్‌పి చెప్పకనే చెప్పుతుంది. ఇప్పుడిప్పుడే ఎస్‌సి, ఎస్‌టి , బీసీ సామాజికవర్గంపై పోరుబాట ఎంచుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌టి , ఎస్‌సి , బీసీ సామాజిక నేతలు చదువుకున్న వారు ఆ పార్టీపై మక్కువ చూపిస్తున్నారు. రానున్న రోజులలో కాస్తా బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News