Monday, December 23, 2024

గాంధీ భారత్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గాంధీజీ భారత దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా భట్టి మాట్లాడారు.  ప్రస్తుతం దేశంలో అశాంతి, విభజన చోటుచేసుకుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ విభజన పెరిగిందన్నారు. ఒకరిద్దరి దగ్గరే దేశం ఆర్థిక సంపద ఉందన్నారు.  హిందూ ముస్లిం భాయి భాయ్ అంటూ జాతిని ఏకం చేసిన గాంధీ ఆలోచనలకు భిన్నంగా దేశాన్ని మత ప్రాతిపదికగా విభజించాలని బిజెపి ప్రయత్నం చేస్తోందని భట్టి మండిపడ్డారు. దేశంలో విభజన, అశాంతి అంశాలు ప్రజలను ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయని, అసమానతలు లేని దేశం కావాలని గాంధీ కోరుకున్నారని వివరించారు. గాంధీ ఆలోచనా విధానం ప్రజల ఆలోచన విధానం, ప్రభుత్వ పరిపాలన విధానం కావాలన్నారు. రాజకీయ, సామాజిక వ్యత్యాసం లేని ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని గాంధీ ఆశించారన్నారు. బిజెపి పాలనలో దేశంలో ఆర్థిక అసమానతల పెరిగాయన్నారు. బిజెపి ఎనిమిదేళ్ల పరిపాలనలో కేవలం ఇద్దరు వ్యాపారులు మాత్రమే ప్రపంచ కుబేరులుగా ఎదిగారని భట్టి మండిపడ్డారు. గాంధీ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా దేశంలో బిజెపి పాలన సాగిస్తోందని, ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో దేశంలో స్వాతంత్రం సౌబ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం లోపించిందని, రాజకీయాల్లో మతాన్ని చొప్పించి లబ్ది పొందాలని బిజెపి చూస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆలోచనా విధానంతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో రాహుల్ చేపట్టే భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

ఎఐసిసి అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన పార్లమెంటు సభ్యులు మల్లిఖార్జున ఖర్గే అపార అనుభవం కలిగిన నాయకుడని భట్టి మెచ్చుకున్నారు. ఎఐసిసి అధ్యక్ష బరిలో ఖర్గే నిలవడాన్ని స్వాగతిస్తున్నామని, ఖర్గే ఎన్నిక ఏకగ్రీవం కావాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. శిథరూర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవలని కోరారు. మల్లిఖార్జున ఖర్గే గాంధేయవాదన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్థేశం చేశారు. ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బిజెపి నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. వంత పడుతున్న మీడియాతో బిజెపి ఖర్గేపై విషపూరిత ప్రచారం చేయిస్తుందని భట్టి మండిపడ్డారు. ఖర్గే ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నం బిజెపి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్ గా పదిసార్లు వరుసగా ఎన్నికల్లో ఓటమి ఎరగకుండా విజయం సాధించిన అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన దక్షిత, నాయకత్వ లక్షణాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత విధేయత కలిగిన గాంధేయవాది అయిన ఖర్గే చరిత్రను తెలుసుకోవాలని బిజెపోళ్లకు భట్టి సూచించారు. విష ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News