Monday, December 23, 2024

టిఆర్‌ఎస్ ఆస్ట్రియా నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Election of new Executive Committee of TRS Austria

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఆస్ట్రియా నూతన కార్యవర్గాన్ని -టిఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కొరకు యూరప్‌లోని పలు దేశాల్లో పర్యటిస్తున్నానని ఈ పర్యటనలో భాగంగా అన్ని దేశాల ఎన్‌ఆర్‌ఐలు కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రియా దేశంలో అన్ని రాష్ట్ర ఎన్నారైలతో సమావేశమై కెసిఆర్ నూతన జాతీయ పార్టీకి మద్ధతును కూడగట్టానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ ఆస్ట్రియా ప్రెసిడెంట్‌గా అనుమండ్ల లకా్ష్మరెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా కోరండ్ల ప్రవీణ్, జనరల్ సెక్రటరీగా బొల్లాడి లకా్ష్మరెడ్డి, సెక్రటరీగా కృష్ణకుమార్, ఐటి సెక్రటరీగా రంగు మహేష్ గౌడ్, కోశాధికారిగా సంగేడు శ్రీనివాస్ గౌడ్, స్పోక్ పర్సన్‌గా దోర్నాల సంతోష్ కుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్‌గా మేడిపల్లి వివేక్ రెడ్డిలు నియమితులయ్యారని మహేశ్ బిగాల తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News