Wednesday, January 22, 2025

ఎస్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం(ఎస్‌టియుటిఎస్) అధ్యక్షులుగా ఎం. పర్వత రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి.సదానందం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎస్‌టియు భవన్ కాచిగూడలో 77వ వార్షిక కౌన్సిల్ సమావేశం అధ్యక్షులు సదానందం గౌడ్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2024 -25 సంవత్సారానికి గానూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్‌టియుటిఎస్ అధ్యక్షులుగా ఎం. పర్వత రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి.సదానందం గౌడ్, ఆర్థిక కార్యదర్శిగా ఆట సదయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు 10 మంది అసోసియేట్ అధ్యక్షులు, 24 మంది ఉపాధ్యక్షులు,10 మంది అదనపు ప్రధాన కార్యదర్శులు, 24 మంది కార్యదర్శులు, ఎనిమిది మంది ఆర్థిక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

ఎఫ్‌ఎల్‌ఎన్ ఉన్నతి, లక్ష్య వంటి వినూత్న ప్రక్రియల పేరుతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఎస్‌టియు కౌన్సిల్ సమావేశం అభిప్రాయపడింది. తరగతి గదిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేక ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రయోజనం లేని కార్యక్రమాలను రూపొందించి కొందరు ఉపాధ్యాయులు డిప్యూటేషన్ల పేరుతో ఎస్‌సిఇఆర్‌టిలో తమ పబ్బం గడుపుకుంటున్నారని,వెంటనే ఆ ఉపాధ్యాయులను పాఠశాలకు పంపాలని ఎస్టియుటిఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్ రెడ్డిలు విద్యాశాఖ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని,బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News