Sunday, December 22, 2024

ఇంటి వద్దే ఓటుకు 12డి ఫారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వయో వృద్ధులు ఇంటి దగ్గర నుంచే ఓటు వేయాలనుకుంటే.. బిఎల్‌ఓ నుంచి 12డి ఫారం తీసుకొని వివరాలు నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ సూచించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నదే కేంద్ర ఎన్నికల సంఘం ఉద్దేశమని, అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వికాస్‌రాజ్ తెలిపారు. నగదు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు.

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఇసి పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసిందని, వస్తున్న సమాచారం ఆధారంగా ఇతర అధికారుల విషయంలో నిర్ణయాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఓటరు అవగాహన కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఓటర్లకు త్వరలోనే గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇంటి దగ్గర ఓటు వేయాలనుకునే వారు బిఎల్‌ఓ నుంచి 12డి ఫారం తీసుకొని వివరాలు నమోదు చేయాలని వికాస్‌రాజ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News