Monday, January 20, 2025

ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్టా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ , ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితాను పకడ్బందీగా, పూర్తిగాపారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష జరిపారు. ఇది ఎన్నికల సంవత్సరం అయినందున ఓటరు జాబితాను పునః పరిశీలించుకుని ఎక్కడైనాలోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలన్నారు. 2018, 2019 ఎన్నికల సమయంలో ఓటరు జాబితాతో పోలిస్తే, ప్రస్తుతం ఎక్కడైనా ఓటర్ల సంఖ్య తగ్గినట్లయితే అందుకు గల కారణాలను పరిశీలించాలని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీశీలన జరిపే ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబందించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఈనెల 23 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి పోస్టల్ శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు అందించే ప్రక్రియను కొనసాగించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఎన్నికల నిర్వహణకు సంబందించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికారు.

ఇప్పనటికే ఈవిఎంల ప్రాథమిక పరిశీలన ప్రక్రియ ఆయా జిల్లాల్లో ప్రారంభమైందని గుర్తు చేశారు. జూలై 1 నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. అన్ని చోట్ల పోలింగ్ శాతం పెరిగేలా చొరవ చూపాలని, గత ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువపోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీ వ్‌గాంధీ హనుమంతు, ఇన్‌ఛార్జి. పోలీస్ కమిషనర్ ప్రవీన్‌కుమార్, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, డిఆర్‌డిఓ చందర్, జడ్పీ సిఇఓ గోవింద్, ఆర్డీఓల రవి, రాజేశ్వర్, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, సహాయ ఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News