Sunday, June 30, 2024

భారత్ హిందూ రాష్ట్రం కాదని తేల్చిన ఎన్నికల ఫలితాలు: అమర్త సేన్

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: భారత్ హిందూ రాష్ట్రం కాదన్న వాస్తవాన్ని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త సేన్ వెల్లడించారు. విచారణ లేకుండా ప్రజలను జైళ్లలో ఉంచడం బ్రిటిష్ పాలన నుంచి దేశంలో కొనసాగడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో భారత్ హిందూ రాష్ట్రం కాదని తేలిపోయిందని బుధవారం ఇక్కడి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక బెంగాలీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అమర్త సేన్ అభిప్రాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన అమెరికా నుంచి ఇండియా చేరుకున్నారు.

ప్రతి ఎన్నిక తర్వాత ఏదో మార్పు జరుగుతుందని మనం ఆశిస్తామని, అయితే గతంలో జరిగినట్లుగా విచారణ లేకుండా ప్రజలను జైళ్లలో పెట్టడం, పేదలకు, సంపన్నులకు మధ్య ఎడం పెరగడం వంటివి ఇంకా కొనసాగుతున్నాయని, అవి ఆగాలని 90 ఏళ్ల ఆర్థికవేత్త అన్నారు. భారత్ లౌకిక దేశం కావడం, లౌకి రాజ్యాంగం ఉండడం వంటివి దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా కొంత విశాల దృక్పథం అవసరమని ఆయన చెప్పారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చాలన్న ఆలోచన తన దృష్టిలో సరైనది కాదని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడిన కేంద్ర క్యాబినెట్ పాత దానికి కాపీగా ఆయన అభివర్ణించారు.

మంత్రులు అవే శాఖలను నిర్వహిస్తున్నారని, కొద్దిపాటి మార్పు ఉన్నప్పటికీ రాజకీయ శక్తిమంతులు ఇప్పటికీ శక్తిమంతులేనని యన వ్యాఖ్యానించారు. తన చిన్నతనంలో బ్రిటిష్ పాలనలో ప్రజలను ఎటువంటి విచారణ లేకుండా జైళ్లలో ఉంచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనంలో తన బంధువులు పలువురిని ఎటువంటి విచారణ లేకుండా జైళ్లలో ఉంచారని, భారత్‌లో ఇటువంటివి ఉండవని తాను ఆశించానని, ఇది ఆగకపోవడానికి కాంగ్రెస్‌ను కూడా నిందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ దీన్ని మార్చలేదని, ప్రస్తుత ప్రభుత్వంలో ఇది మరింత ఎక్కువగా ఉందని అమర్త సేన్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News