Wednesday, December 25, 2024

ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఫలితాలుంటాయి: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అన్నారు. ఆమె సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నొక్కి చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సోనియా గాంధీ ఢిల్లీలోని డిఎంకె కార్యాలయాన్ని సందర్శించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

కరుణానిధి జయంతి కార్యక్రమానికి కమ్యూనిస్టు నాయకులు రాజా, సీతారాం ఏచూరి, సమాజ్ వాదీ నాయకుడు  రామ్ గోపాల్ యాదవ్ సహా ఇండియా కూటమి నాయకులు కూడా హాజరయి కరుణానిధికి నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News